దీపం వెలిగే ప్రదేశమే లక్ష్మీదేవి స్థిరనివాసం

ఆధ్యాత్మిక చింతన .. దైవారాధన కలిగిన ప్రతి ఒక్కరి ఇళ్లలోను పూజా మందిరం తప్పక వుంటుంది. ప్రతి ఒక్కరూ తమ పూజా మందిరంలో తమ ఇష్టదేవతా రూపాన్ని ప్రతిష్ఠించుకుని పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. సాధారణంగా చాలామంది అగ్గిపుల్లతో దీపం వెలిగిస్తూ వుంటారు. అలా కాకుండా ముందుగా ఒక దీపాన్ని వెలిగించి .. ఆ దీపం ద్వారా భగవంతుడికి ఇరువైపులా గల ప్రధానమైన ప్రమిదల్లోని వత్తులను వెలిగించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

కొంతమంది పూజా మందిరంలోని ప్రమిదల్లో కొద్దిగా నూనె పోసి దీపారాధన చేసేసి వెళ్లిపోతుంటారు. అలా కాకుండా చేసిన దీపారాధన ఒక అరగంట సేపైనా వెలిగేలా చూసుకోవాలి. ఇక మరికొంతమంది ఉదయం వేళలో మాత్రమే దీపారాధన చేస్తుంటారు. సాయంత్రం వేళలో కూడా తప్పకుండా దీపారాధన చేయాలి. పూజా మందిరం చీకటిగా లేకుండా దీపం వెలుగుతూ వుండాలి. దీపం వెలిగే చోటున లక్ష్మీదేవి కొలువై ఉంటుంది .. అందువలన దారిద్య్రం తొలగిపోతుంది. ఆపదలు .. అనారోగ్యాలు .. దుష్టశక్తుల పీడలు దరిదాపుల్లోకి రాకుండాపోతాయి.    


More Bhakti News