కార్తిక మాసంలో వనభోజన ఫలితం

కార్తిక మాసం ఎంతో విశేషమైనది .. మరెంతో విశిష్టమైనది. అలాంటి పరమపవిత్రమైన ఈ మాసంలో స్నానం .. దీపారాధన .. ధ్యానం .. దానం అనంతమైన ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ఇంట్లో తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి. దేవాలయానికి వెళ్లి ఆకాశ దీప దర్శనం చేసుకోవాలి. వరిపిండితో గానీ .. గోధుమ పిండితోగాని చేసిన ప్రమిదలలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి, నదీ తీరాలలో గానీ ..ఆలయాలలో గాని బ్రాహ్మణులకు దానం ఇవ్వవలసి ఉంటుంది.

ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ నక్షత్రాలు కనిపించాక శివార్చన .. విష్ణుపూజ చేసి ఆహారం తీసుకోవాలి. తులసివనంలో గానీ .. రావిచెట్టు క్రిందగాని భగవన్నామ స్మరణ చేసుకోవాలి. ఉసిరిక చెట్టుకు తొమ్మిది ప్రదక్షిణలు చేసి, కార్తీక దామోదరుడిని పూజించాలి. ఆ తరువాత ఆ చెట్టునీడలో వనభోజనాలు చేయాలి. ఈ మాసంలో ఉసిరిక చెట్టును పూజించడం వలన .. ఆ చెట్టుకింద వనభోజనాలు చేయడం వలన అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందనేది మహర్షుల మాట.      


More Bhakti News