Skip to content

కార్తికమాసంలో శివుడికి అభిషేకం .. ఫలితం

కార్తికమాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో తులసిని పూజించడం వలన .. తులసిమాల ధరించడం వలన .. ఉసిరిక చెట్టును పూజించడం వలన శ్రీమహా విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శ్రీమహా విష్ణువు అలంకార ప్రియుడైతే, శివుడు అభిషేక ప్రియుడు అనే సంగతి తెలిసిందే. ఒక్కో అభిషేక ద్రవ్యంతో శివయ్యకి అభిషేకం చేస్తే ఒక్కో విశేషమైన ఫలితం ఉంటుందనేది మహర్షుల మాట.

పాలతో అభిషేకం చేయడం వలన శుభాలు చేకూరతాయి. పెరుగుతో అభిషేకం చేయడం వలన ఆరోగ్యంగా వుంటారు. నెయ్యితో అభిషేకం చేయడం వలన సంతానం .. తేనెతో అభిషేకం చేయడం వలన తేజస్సు లభిస్తాయి. కొబ్బరినీళ్లతో అభిషేకం చేయడం వలన సంపదలు చేకూరతాయి. మామిడిపండ్ల రసంతో అభిషేకం చేయడం వలన ధనధాన్యాలు సమకూరతాయి. నేరేడుపండ్ల రసంతో అభిషేకం చేయడం వలన విజయాలు లభిస్తాయి. ఇక గంగా జలంతో శివలింగాన్ని అభిషేకించడం వలన మోక్షం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.        

More Bhakti Articles