Skip to content

పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం

జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక విషయంగా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో కష్టాలు .. నష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. ఒక్కోసారి సమస్యలన్నీ కలిసి ఒక్కసారిగా దాడి చేస్తుంటాయి. ఎంతటివారైనా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ సమస్యల నుంచి బయటపడటం కోసం సతమతమవుతుంటారు. అలాంటి పరిస్థితులకి 'సత్యనారాయణ స్వామి' వ్రతానికి మించిన విరుగుడులేదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఆచరించడం వలన, కష్టతరమైన గండాలనుంచి బయటపడినవారి కథలు పురాణాలలోను కనిపిస్తాయి. 'సత్యనారాయణ స్వామి' వ్రతాన్ని పౌర్ణమి రోజున ఆచరించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయనేది మహర్షుల మాట. సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించడం వలన, అన్నిరకాల కష్టాలనుంచి విముక్తి కలుగుతుంది. ఆర్ధిక పరమైన .. ఆరోగ్యపరమైన .. మానసికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి .. సకల శుభాలు చేకూరతాయి. అందువలన పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకునే అవకాశాన్ని వదులుకోకూడదు.    
sathyanarayana swami vratham

More Bhakti Articles