నెయ్యితో శిరోజాల సౌందర్యం... ట్రై చేయండి!

శిరోజాల సౌందర్యం గురించి చెప్పాలంటే 20 ఏళ్లు వెనక్కి వెళ్లి చూడాల్సిందే. నాటి కాలంలో స్త్రీలు ఒత్తైన కురులతో నిగనిగ లాడే శిరోజాలతో చూపు తిప్పుకోనిచ్చేవారు కాదు. మరి నేడు అంతటి కేశ సౌందర్యం ఎంత మందికి ఉంది చెప్పండి..?

కాలుష్యం పెరిగిపోయి, వేడి వాతావరణం కారణంగా నేడు ఆ సౌందర్యం మసకబారిపోతోంది. మగవారికే పరిమితం కాకుండా బట్టతల సమస్య ఆడవారినీ వేధిస్తోంది. తలస్నానం చేస్తే.. తల దువ్వుకుంటే గుప్పెడేసి కురులు ఊడి వచ్చేస్తుంటే ఎవరికి బాధ కలగదు. పైగా యవ్వనవంతులనూ తెల్ల వెంట్రుకల సమస్య వేధిస్తోంది. సాధారణంగా శిరోజాల కోసం ఎన్నో రకలా నూనెలు మార్కెట్లో ఉన్నాయి. అయితే, నెయ్యి కూడా శిరోజాల ఆరోగ్యానికి మంచిగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

కండిషనింగ్ కు..

దేశీయ నెయ్యి శిరోజాలకు మంచి కండిషనర్ గా నిగనిగలాడేలా చేస్తుందట. రెండు చెంచాల నెయ్యిని ఒక చెంచా ఆలివ్ ఆయిల్ తో కలిపి తల వెంట్రుకలకు రాసి 20 నిమిషాల పాటు అలా ఉంచేయాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.

వెంట్రుకల చివర్లు ముక్కలవుతున్నాయా...

representational imageవెంట్రుకల చివర్లు రెండుగా అవుతున్నాయా...? దీంతో ట్రిమ్ చేస్తున్నారా…? అంటే పొడవు తగ్గించుకుంటున్నారా...? ఈ సమస్యను నెయ్యితో వదిలించుకోవచ్చట. మూడు చెంచాల నెయ్యి తీసుకుని వెంట్రుకల చివర్లలో రాయాలి. 15 నిమిషాల తర్వాత దువ్వెన తీసుకుని దువ్వుకోవాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపుతో కడిగేసుకుంటే చాలు.

చుండ్రుపై కూడా ఇదే అస్త్రం...

పొడి జుట్టు, పొడి చర్మం ఉండి చుండ్రుతో బాధపడుతున్నవారు నెయ్యిని వాడితే ఫలితం ఉంటుందంటున్నారు. గోరువెచ్చని నెయ్యికి బాదం నూనె కలిపి కురుల మొదళ్లలో రాసుకుని పదిహేను నిమిషాలు అలా ఉంచేయాలి. తర్వాత నూనె పోయేలా రోజ్ వాటర్ తో శిరోజాలను కడిగేయాలి. నెలకు రెండు సార్లు ఇలా చేసి చూస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ ఇలా చర్మ గుణాల్లో రకాలు ఉంటాయి. ఫలానాది అందరికీ సరిపడదు. నెయ్యి విషయంలోనూ అంతే. అందుకని ఒకటి రెండు సార్లు ఉపయోగించి ఫలితం ఉంటే కొనసాగించడం, లేదంటే నిలిపివేయడం శ్రేయస్కరం.


More Articles