ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. పురపోరులో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్న ఆ పార్టీ, శనివారం నాడు మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రెండు కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులను, 10 మున్సిపాలిటీలకు చైర్‌పర్సన్ అభ్యర్థులను ప్రకటించింది.

తాజా జాబితా ప్రకారం, కీలకమైన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, ఒంగోలు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా నల్లమల్లి శ్రీ శిల్ప పేరును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది.

10 మున్సిపాలిటీలకు చైర్‌పర్సన్ అభ్యర్థులు
ఈ జాబితాలో 10 మున్సిపాలిటీలకు చైర్‌పర్సన్ అభ్యర్థులను కూడా పార్టీ ప్రకటించింది. ఆ వివరాలు కింద ఉన్నాయి:
చీమకుర్తి: సిద్దా సుధాకర్ 
కనిగిరి: అచ్చాల తిరుపతమ్మ 
మండపేట: వేగుళ్ల అజయ్ కుమార్ 
నూజివీడు: బర్రె ఇళయరాజా 
పలమనేరు: సి. రాజ్యలక్ష్మి 
పార్వతీపురం: బెలగాం కరుణ 
పిడుగురాళ్ల: షేక్ బాబావలి 
పుంగనూరు: నయీమా తాజ్ 
సత్తెనపల్లి: మారెళ్ల రామాంజనేయులు 
వినుకొండ: చెరుకుంపాలెం షమీమ్ ఖాన్

ఇప్పటివరకు 70 స్థానాలు ఖరారు
తాజా జాబితాతో కలిపి టీడీపీ ఇప్పటివరకు మూడు విడతల్లో అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం మీద 10 కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులను, 60 మున్సిపాలిటీలకు చైర్‌పర్సన్ అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది. మిగిలిన స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.