13 మంది పిల్లల తండ్రికి కరోనా పాజిటివ్ నిర్ధారణ
- స్కాట్లాండ్‌లో ఘటన
- ఐసోలేషన్‌లో తండ్రి
- క్వారంటైన్‌లో కుటుంబ సభ్యులు
- త్వరలోనే కోలుకుంటానంటోన్న తండ్రి
అది స్కాట్లాండ్‌లోని ఓ కుటుంబం. రాయ్, ఎమ్మా హన్ దంపతులకి 13 మంది పిల్లలు. స్కాట్లాండ్‌లోనే అతి పెద్ద కుటుంబాల్లో వీరి కుటుంబం ఒకటి. 13 మంది పిల్లల్లో 10 మంది తల్లిదండ్రులు ఉండే డూండీ ప్రాంతంలోని ఇంట్లోనే ఉంటున్నారు. మిగతా ముగ్గురు మాత్రం వేరే ప్రాంతాల్లో ఉండి చదువుకుంటున్నారు.
కరోనా వైరస్ లక్షణాలతో రాయ్ పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ అని తేలడంతో ఆ కుటుంబంలో భయాందోళనలు నెలకొన్నాయి. తనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో తనకు కరోనా ఎలా వచ్చిందనే విషయంపై ఆశ్చర్యపోయానని రాయ్ తెలిపారు.
'మేముండే ప్రాంతంలో చాలా మంది కొవిడ్-19 రోగులు ఉన్నారు. కానీ, నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. వ్యక్తిగత రక్షణ పరికరాలు కూడా వాడుతున్నాను' అని రాయ్ చెప్పారు. ఇంట్లోనే ఉంటున్నప్పటికీ అప్పుడప్పుడు సూపర్‌మార్కెట్‌కు వెళ్లాల్సి వస్తుందని, అప్పుడే తనకు కరోనా సోకి ఉండొచ్చని అంటున్నారు.
ప్రస్తుతం రాయ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటుండగా, ఆయన కుటుంబ సభ్యులు 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్నారు. రాయ్‌కి సుమారు 50 ఏళ్లు ఉంటాయి. ఆయనకు టైప్-2 డయాబెటిస్ కూడా ఉంది. తాను తిరిగి ఆసుపత్రి నుంచి ఇంటికి పూర్తి ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సానుకూల దృక్పథంతోనే తాను ఉంటున్నానని, తన కుటుంబాన్ని త్వరలోనే కలుస్తానని తెలిపారు. వారి పిల్లలకు 28 నుంచి 5 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది. వారి కుటుంబానికి పెద్ద మొత్తంలో నిత్యావసరాలు అవసరం ఉంటాయి. తన భర్తకు కరోనా సోకిందని తెలుసుకున్న వెంటనే తనకు ఏడుపు వచ్చేసిందని ఎమ్మా హన్ తెలిపింది.