నేను చెప్పే సూచనలపై కేసీఆర్ ఆలోచించాలి: జగ్గారెడ్డి
- లాక్ డౌన్ ను మరో రెండు, మూడు నెలలు పొడిగించాలి
- పోలీసులు, వైద్య సిబ్బందికి అన్ని సదుపాయాలు కల్పించాలి
- ప్రభుత్వాలకు ఆర్థిక నిపుణులు సలహాలు ఇవ్వాలి
మే 3వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మే 7వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన డిమాండ్ చేశారు. లాక్ డౌన్ ఫలితాలు ఇప్పుడిప్పుడే కనపిస్తున్నాయని ఆయన అన్నారు. కరోనా విస్తరించకుండా ఉండాలంటే లాక్ డౌన్ ను పొడిగించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. మరో రెండు, మూడు నెలలు లాక్ డౌన్ ను పొడిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు.
కరోనా కట్టడిలో భాగంగా 24 గంటలు విధులను నిర్వహిస్తున్న పోలీసులకు అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్న డాక్టర్లు, నర్సులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని కోరారు. ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలనే విషయంపై ప్రభుత్వాలకు నిపుణులు సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పారు. తాను చేస్తున్న సూచనలపై కేసీఆర్ ఆలోచించాలని విన్నవించారు.