ఉద్రిక్తతలపై చర్చలు జరిపేందుకు సిద్ధమైన భారత్-చైనా
- ఈ నెల 6న అగ్రశ్రేణి కమాండర్ల భేటీ
- ధ్రువీకరించిన రాజ్‌నాథ్
- చర్చలతో సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు
లడఖ్‌లోని సరిహద్దుల వద్ద భారత్-చైనాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటామని ఇరు దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ మేరకు ఈ నెల 6న ఇరు దేశాల అగ్రశ్రేణి కమాండర్లు చర్చలు జరపనున్నారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ధ్రువీకరించారు.
లడఖ్‌లోని పలు ప్రాంతాల్లోకి చైనా సైన్యం చొచ్చుకురావడంతో భారత్ అందుకు దీటుగా చర్యలు తీసుకుంది. సరిహద్దుల వద్ద మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకోవడం, ఎయిర్ బేస్ పనులను చైనా విస్తృతం చేయడంతో భారత్ కూడా అక్కడ ప్రాంతాల్లో రోడ్లు వేస్తూ సైనికులు వెంటనే వెళ్లేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను విస్తరించుకుంటోంది. తాము ఈ పనులను ఆపబోమని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.