తీవ్ర ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 185 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 65 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 5 శాతానికి పైగా పుంజుకున్న ఎం అండ్ ఎం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలతో పాటు, దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే, ట్రేడింగ్ చివరి రెండు గంటల్లో ఐటీ, ఫార్మా స్టాకుల అండతో మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 185 పాయింట్ల లాభంతో 39,086 వద్ద ముగిసింది. నిఫ్టీ 65 పాయింట్లు పెరిగి 11,535 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (5.77%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.21%), టాటా స్టీల్ (2.30%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.08%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.67%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఆటో (-2.62%), ఏసియన్ పెయింట్స్ (-1.63%), సన్ ఫార్మా (-1.48%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.25%), నెస్లే ఇండియా (-1.12%).