కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి పరామర్శించిన చంద్రబాబు
- గత నెల కరోనాతో ఆసుపత్రిలో చేరిక
- డిశ్చార్జ్ అయ్యాక శ్వాసకోశ సమస్యలతో మరోమారు ఆసుపత్రికి
- పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు
అనారోగ్యంతో ఇటీవల ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఫోన్ చేసి పరామర్శించారు. షా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
గత నెల 2న కరోనా బారినపడిన అమిత్ షా గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. అదే నెల 14న తిరిగి నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రిపోర్టులు రావడంతో మంత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ఆ తర్వాత శ్వాసకోశ సమస్యతో 18న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆరోగ్యం కుదుటపడడంతో అదే నెల 31న తిరిగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు.