మెన్స్ జూనియర్ ఆసియా కప్.. ఫైనల్లో పాకిస్థాన్ బోల్తా.. హ్యాట్రిక్ కొట్టిన ఇండియా హాకీ జట్టు
- మస్కట్ వేదికగా జరిగిన మెన్స్ జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీ ఫైనల్
- 5-3 గోల్స్ తేడాతో పాక్‌ను మట్టికరిపించిన భారత్
- భారత్ తరఫున అర్జీత్ సింగ్ నాలుగు, దిల్‌రాజ్ సింగ్ ఒక గోల్
- ఓవరాల్‌గా భారత్ ఈ టైటిల్ గెలవడం ఐదోసారి
మస్కట్ వేదికగా జరిగిన మెన్స్ జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 5-3 గోల్స్ తేడాతో పాక్‌ను టీమిండియా మట్టికరిపించింది. దీంతో వరుసగా మూడోసారి ట్రోఫీ గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. ఓవరాల్‌గా భారత్ ఈ టైటిల్ గెలవడం ఐదోసారి. భారత్ తరఫున అర్జీత్ సింగ్ నాలుగు, దిల్‌రాజ్ సింగ్ ఒక గోల్ కొట్టారు.
భారత్ మొదటిసారి 2004లో మెన్స్ జూనియర్ ఆసియా కప్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత 2008, 2015, 2023, 2024లో ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో ఇప్పటివరకు అత్యధికసార్లు ఈ టైటిల్ గెలిచిన జట్టుగా భారత్ కొనసాగుతోంది. టీమిండియా తర్వాత పాకిస్థాన్ మూడుసార్లు ఈ ట్రోఫీ సాధించింది.
కాగా, ట్రోఫీ గెలిచిన సందర్భంగా ఆటగాళ్లు, సిబ్బందికి హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. ఒక్కో ఆటగాడికి రూ. 2 లక్షలు ఇవ్వనుంది. అలాగే సిబ్బందికి తలో రూ. 1లక్ష రివార్డు ఇవ్వాలని నిర్ణయించింది.