పాండ్యా బాట‌లోనే చాహ‌ల్‌... ధ‌న‌శ్రీతో విడాకుల‌కు రెడీ అయ్యాడా?... భార్య ఫొటోలు డిలీట్ చేసిన క్రికెట‌ర్‌!

  • చాహ‌ల్‌-ధ‌న‌శ్రీ విడాకుల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు కొంత‌కాలంగా ఊహాగానాలు
  • ఆ ఊహాగానాల‌కు ఊత‌మిచ్చేలా ఇప్ప‌టికే ఇన్‌స్టాలో ఒక‌రినొక‌రు అన్‌ఫాలో చేసుకున్న జంట‌
  • ఇప్పుడు చాహ‌ల్‌ త‌న భార్య ఫొటోల‌ను డిలీట్ చేయ‌డంతో మ‌రింత బ‌ల‌ప‌డ్డ ఊహాగానాలు
టీమిండియా స్టార్ క్రికెట‌ర్ హార్దిక పాండ్యా-న‌టాషా దంప‌తులు గ‌తేడాది విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట‌.. ఒక కుమారుడు పుట్టిన త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో విడిపోయారు. ఇప్పుడు పాండ్యా బాట‌లోనే మ‌రో భార‌త క్రికెటర్ య‌జువేంద్ర చాహ‌ల్ ప‌య‌నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ స్టార్ స్పిన్నర్ త‌న భార్య ధ‌న‌శ్రీ వ‌ర్మ‌తో విడాకుల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు కొంత‌కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఆ ఊహాగానాల‌కు ఊత‌మిచ్చేలా ఇప్ప‌టికే ఈ జంట ఇన్‌స్టాలో ఒక‌రినొక‌రు అన్‌ఫాలో కూడా చేసుకున్నారు. తాజాగా చాహ‌ల్ త‌న భార్య ఫొటోల‌ను డిలీట్ చేశాడు. దీంతో వీరిద్ద‌రూ విడిపోతార‌నే ఊహాగానాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయ‌నే చెప్పాలి. అయితే, ధ‌న‌శ్రీ మాత్రం భ‌ర్త‌తో ఉన్న ఫొటోల‌ను తొల‌గించ‌లేదు.   

ఈ జంట క‌చ్చితంగా విడాకులు తీసుకోనుందని, ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించేందుకు కొంచెం స‌మ‌యం ప‌ట్టొచ్చని సంబంధిత వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే, వీరిద్ద‌రూ విడిపోయేందుకు క‌చ్చిత‌మైన కార‌ణాలు తెలియ‌దని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

కాగా, కొరియోగ్రాఫర్‌, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌, దంత వైద్యురాలైన‌ ధ‌న‌శ్రీ వ‌ర్మ‌ను చాహ‌ల్ 2020 డిసెంబ‌ర్ 22న పెళ్లాడారు. వివాహం తర్వాత వీళ్లిద్దరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ అభిమానుల‌ను అల‌రించారు. అయితే, ఇటీవలే ధనశ్రీ తన పేరు నుంచి ‘చాహల్‌’ నేమ్‌ను తీసేయడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. 

ఆ తర్వాత చాహల్ కూడా ‘న్యూ లైఫ్‌ లోడెడ్‌’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. దీంతో వీరు విడాకులు తీసుకోవడం ఖాయం అని ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే వీరు తమ సోషల్‌ మీడియా ఖాతాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఆ ఊహాగానాల‌కు మరింత బ‌లం చేకూర్చిన‌ట్లైంది. ఇప్పుడు చాహల్ తన భార్య ఫొటోల‌ను డిలీట్ చేయ‌డంతో మ‌రోసారి వీరి విడాకుల అంశం నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారింది.   


More Telugu News