'ఒక యముడి ప్రేమకథ' (ఆహా) మూవీ రివ్యూ!
- మలయాళంలో రూపొందిన సినిమా
- ఈ నెల 5 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్
- బలహీనమైన కథాకథనాలు
- ఆకట్టుకోని సన్నివేశాలు
- హీరోయిన్స్ కి దూరంగా హీరో చేసే విన్యాసం
మలయాళంలో దుల్కర్ సల్మాన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. 2019లో ఆయన నుంచి ఒక సినిమా వచ్చింది. నౌఫాల్ దర్శకత్వం వహించిన ఆ సినిమా పేరే 'ఒరు యమండన్ ప్రేమకథ'. ఈ సినిమా ఇప్పుడు 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ' ఒక యముడి ప్రేమకథ' టైటిల్ తో ఈ నెల 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది చూద్దాం.
కథ: లల్లూ ( దుల్కర్) బాగా చదువుకోవాలనీ .. డీసెంట్ గా ఉండాలని తండ్రి కోరుకుంటాడు. అయితే అందుకు భిన్నంగా అతను తయారవుతాడు. చిన్నప్పటి నుంచి మాస్ ఫ్రెండ్స్ తో తిరుగుతూ .. తాగుతూ మాస్ గానే తయారవుతాడు. తన స్నేహితులైన విక్కీ .. ఢిల్లీ .. కృష్ణమూర్తితో కలిసి తిరుగుతూ ఉంటాడు. కృష్ణమూర్తి అధ్వర్యంలో అందరూ కలిసి ఒక టీమ్ గా ఏర్పడి రంగులు వేసే పనితో రోజులు నెట్టుకొస్తూ ఉంటారు.
లల్లూకి ఒక తమ్ముడు ఉంటాడు. బాగా చదువుకుని ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతనికి పెళ్లి చేయాలంటే ముందుగా లల్లూ పెళ్లి చేసుకోవాలి. అందువలన ఆ విషయంలో పేరెంట్స్ అతనిని ఒత్తిడి చేస్తూ ఉంటారు. తనని చేసుకోమంటూ జెస్నా (సంయుక్తా మీనన్) లల్లూ వెంటపడుతూ ఉంటుంది. తాను పెళ్లాడవలసిన అమ్మాయి కనిపించినప్పుడు తనకి ఒక స్పార్క్ వస్తుందనీ, అప్పుడు ఆమెనే పెళ్లి చేసుకుంటానని లల్లూ మాటదాటేస్తూ ఉంటాడు.
ఒక రోజున 'కనబడుట లేదు' అనే ప్రకటన పేపర్లో వస్తుంది. ఆ యువతి పేరు దియా ( నిఖిలా విమల్). ఆ యువతి ఫొటో చూసిన లల్లూ, తనకి స్పార్క్ వచ్చిందని ఫ్రెండ్స్ తో చెబుతాడు. ఆమె ఆచూకీ తెలుసుకోవడానికి తనకి సహకరించమనీ, తాను ఆమెనే పెళ్లి చేసుకుంటానని అంటాడు. 'దియా' ఎవరు? ఆమె ఎందుకు కనిపించకుండా పోయింది? ఆమె కోసం వెదకడం మొదలెట్టిన లల్లూకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? అనేది కథ.
విశ్లేషణ: కథ ఏదైనా .. ఆ కథతో చేసేది ప్రయత్నమైనా .. ప్రయోగమైనా .. వినోద ప్రధానంగానే అది కొనసాగుతూ ఉండాలి. హీరో ఎంత సంఘసేవ చేస్తూ బిజీగా ఉన్నా, మధ్యలో ఓ చిన్న బ్రేక్ తీసుకుని వచ్చి హీరోయిన్ తో కలిసి చిన్న రొమాంటిక్ టచ్ ఇచ్చి వెళుతూ ఉండాలి. అది పాటలో నైనా .. సీన్ లో నైనా. హీరో మాటల్లోనే తప్ప .. తెరపై హీరోయిన్ కనిపించకపోతే చిరాకుపడిపోతారు. అలా చిరాకు పెట్టే సినిమానే ఇది.
హీరో తన తల్లిదండ్రులకు లేక లేక కలిగిన సంతానం. పురిటిలోనే పోయాడనుకున్నవాడు బ్రతుకుతాడు. మృత్యువును జయించినవాడు కావడం వలన 'యముడు' అని పేరు పెడతారు. మృత్యువును జయించినవాడికి యముడు అని పేరు పెట్టడం ఏంటో .. 'ఈ పేరు బాగుంది .. నాకు నచ్చింది' అని తల్లి అనడం ఏంటో .. మనకి అర్థం కాదు. ఏదో తేడా కొడుకుతుందే అనే చిన్నపాటి అనుమానం మనలో మొదలవుతూనే ఉంటుంది.
కథ మొదలైన కాసేపటి వరకూ తెరపైకి హీరోయిన్ రాకపోతేనే అసహనానికి లోనయ్యే ఆడియన్స్, ఈ సినిమా చివరివరకూ ఆమె కోసం అలా వెయిట్ చేస్తూ కూర్చోవలసి వస్తుంది. క్లైమాక్స్ కి ముందు హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. పోనీలే శుభం కార్డు పడిన తరువాతైనా కలిసి ఉంటారని సగటు ప్రేక్షకుడు ఆశపడతాడు. కానీ దర్శకుడు ఇక్కడ కూడా పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. ఇక అప్పటివరకూ నవ్వించడం కోసం హీరో ఫ్రెండ్స్ నానా అవస్థలు పడతారు .. మనలను నానా ఇబ్బందులు పెడతారు.
పనితీరు: ఈ సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారనేది ఫస్టు సీన్ తోనే క్లారిటీ ఇవ్వడానికి దర్శకుడు ప్రయత్నించి హమ్మయ్య అనుకున్నాడు. ఆ తరువాత ఇంటర్వెల్ కి ముందు ఒక బ్యాంగ్ .. క్లైమాక్స్ లోను ట్విస్ట్ ఉండేలా చూసుకున్నాడు. కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కథ బలపడటానికి కాకుండా, బలహీనపడటానికే ఉపయోగపడ్డాయని చెప్పుకోవలసి ఉంటుంది.
ఆర్టిస్టులంతా మంచి అనుభవం ఉన్నవారే. కాకపోతే వారి పాత్రలలోనే బలం లేదు. సుకుమార్ ఫొటోగ్రఫీ .. బిజిబల్ నేపథ్య సంగీతం .. జాన్ కుట్టి ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. వాళ్ల పనితీరును గురించి చెప్పుకునేంత గొప్పగా కథ లేదు.
ముగింపు: టైటిల్ తోనే తొలి సాహసం చేసిన దర్శకుడు, ఈ సినిమాతో కొత్తదనాన్ని అందించడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. కాకపోతే సాధారణమైన కథలకు అలవాటు పడిపోయిన ప్రేక్షకులకు ఈ కథ అరగదు అంతే.

Movie Name: Oka Yamudi Prema Kadha
Release Date: 2025-06-05
Cast: Dulquer Salman, Nikhila Vimal, Samyuktha Menon, Soubin Shahir, Salim Kumar
Director: Noufal
Producer: Anto Josef
Music: Bijibal
Banner: AJ Film Company
Review By: Peddinti
Oka Yamudi Prema Kadha Rating: 1.75 out of 5
Trailer