శాంసంగ్‌ నుంచి మరో కొత్త ఫ్యాన్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లోకి వచ్చింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 ఎఫ్‌ఈని కంపెనీ సోమవారం దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. 6.7 అంగుళాల డైనమిక్‌ అమోలెడ్‌ 2X డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్‌.. 120Hz రిఫ్రెష్‌ రేట్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ఎగ్జినోస్‌ 2500 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.

ఫొటోగ్రఫీ కోసం వెనుక భాగంలో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఇచ్చారు. ఇందులో 50 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరాతో పాటు 3X ఆప్టికల్‌ జూమ్‌ సదుపాయం ఉంది. 4,900mAh బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్‌ యూఐ 9పై ఫోన్‌ పనిచేస్తుంది. తాజా సాఫ్ట్‌వేర్‌తో విడుదలైన గెలాక్సీ ఎస్‌26 సిరీస్‌ ఫోన్‌గా ఇది నిలిచింది.

భారత్‌లో గెలాక్సీ ఎస్‌26 ఎఫ్‌ఈ ధర రూ.79,999గా నిర్ణయించారు. 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజీతో ఒకే వేరియంట్‌లో లభిస్తుంది. పిస్టాచియో, బ్లూబెర్రీ, గ్రాఫైట్‌ రంగుల్లో కొనుగోలు చేయొచ్చు.

లాంచ్‌ ఆఫర్లలో భాగంగా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేస్తే రూ.8,000 వరకు అప్‌గ్రేడ్‌ బోనస్‌ లభిస్తుంది. ఎంపిక చేసిన ఎన్‌బీఎఫ్‌సీ భాగస్వాముల ద్వారా 30 నెలల వరకు నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. దీనితో పాటు అదనంగా రూ.3,000 అప్‌గ్రేడ్‌ బోనస్‌ పొందొచ్చు. ప్రధాన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.7,000 వరకు క్యాష్‌బ్యాక్‌ లేదా 12 నెలల నో-కాస్ట్‌ బ్యాంక్‌ ఈఎంఐని ఎంచుకోవచ్చు. శాంసంగ్‌ ఈ-స్టోర్‌ ద్వారా కొనుగోలు చేసేవారికి 18 నెలల బ్యాంక్‌ ఈఎంఐ ఆప్షన్‌ కూడా ఉంది.