రోహిత్ శర్మ ప్రస్తుతం క్రికెట్ మైదానంలోనే కాదు, బుల్లితెరపైనా తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అతడు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ’ షోలో సరదా సన్నివేశాలతో పాటు భావోద్వేగ క్షణాలూ చోటుచేసుకుంటున్నాయి. తాజా ఎపిసోడ్‌లో బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, రోహిత్‌కు ఓ ముద్దుపేరు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ షోలో భాగంగా ఓ రౌండ్‌లో రోహిత్ శర్మ చిన్ననాటి ముద్దుపేరు ఏమిటని ప్రశ్నించారు. దానికి రోహిత్ సమాధానమిస్తూ, "నాకు చిన్నప్పుడు ఎలాంటి ముద్దుపేరు లేదు" అని చెప్పాడు. వెంటనే కరిష్మా కపూర్ కలుగజేసుకుని, "మా కపూర్ కుటుంబంలో అందరికీ ముద్దుపేర్లు ఉంటాయి. నాకు కూడా ఉంది. అందుకే నేను మీకు ఓ ముద్దుపేరు పెట్టాలనుకుంటున్నాను" అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. అలా రోహిత్ శర్మకు ‘పూకీ పుల్‌షాటర్’ అనే కొత్త పేరు పెట్టింది. దీనికి రోహిత్ కూడా నవ్వుతూ బదులిచ్చాడు. కరిష్మా కపూర్ ముద్దుపేరు ‘లోలో లవ్’ అని రివీల్ చేసి అందరినీ నవ్వించాడు. ఈ సరదా సంభాషణతో షోలో సందడి వాతావరణం నెలకొంది. ఈ షోలో కరిష్మా తన సోదరులు అదర్ జైన్, అర్మాన్ జైన్, వదిన అనిస్సా మల్హోత్రాతో కలిసి ఒక టీమ్‌గా పాల్గొంది. మరోవైపు చుంకీ పాండే, నీలమ్ కొఠారి, సమీర్ సోనీ, సందీప్ సిక్కంద్‌ల బృందం పోటీపడింది.

సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం సోనీ లివ్‌లో కూడా స్ట్రీమ్ అవుతోంది. ఈ షోలో కరిష్మా తన సోదరులు అదర్ జైన్, అర్మాన్ జైన్, వదిన అనిస్సా మల్హోత్రాతో కలిసి ఒక టీమ్‌గా పాల్గొన్నారు. మరో టీమ్‌లో చుంకీ పాండే, నీలమ్ కొఠారి, సమీర్ సోని, సందీప్ సిక్కంద్ ఉన్నారు. ఈ షో ప్రతి శని, ఆదివారాల్లో సోనీ టీవీలో ప్రసారమవుతూ, సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతోంది.