ప్రతి సోమవారం ఫిర్యాదులు స్వీకరిస్తాం... ఆధారాలతో రావాలి: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తామని వెల్లడి
- మధ్యలో 2 నుంచి 3 గంటల వరకు బ్రేక్!
- ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ
అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం హైదరాబాద్ నగర ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. హైదరాబాద్‌లోని హైడ్రా కార్యాలయం ఉన్న బుద్ధ భవన్‌లో ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, ఆ తర్వాత 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
అయితే ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేసే ముందు పూర్తి ఆధారాలు, వివరాలతో రావాలని సూచించారు. ఈ విషయంలో అనుమానాలు ఉంటే హైడ్రా కార్యాలయాన్ని సంప్రదించవచ్చని చెప్పారు. 040-29565758, 040-29560596 నెంబర్లకు ఫోన్ చేసి కూడా అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.
మరోవైపు, మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా ఇక్కడ వంద అడుగుల రోడ్డును అనుకొని 5 అంతస్తుల బిల్డింగ్ అక్రమంగా నిర్మిస్తున్నట్లు హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అక్కడకు వెళ్లి పరిశీలించాక అక్రమ కట్టడమని తేలిందని వివరించారు. ఇది అక్రమ కట్టడమని హైకోర్టు కూడా నిర్ధారించిందని, కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ భవనాన్ని నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు పరిశీలించాక చర్యలు తీసుకుంటామన్నారు.