స్లిమ్ ల్యాప్ ట్యాప్ కోసం చూస్తున్నారా...? ఇదిగో జాబితా...

ల్యాప్ టాప్ దగ్గరుంటే దాన్ని ఎక్కడికైనా తేలిగ్గా వెంట తీసుకెళ్లొచ్చు. అందుకే విద్యార్థులు, తరచూ ప్రయాణించే వారు ల్యాప్ టాప్ కే ప్రాధాన్యం ఇస్తుంటారు. మరి ల్యాప్ టాప్ లలోనూ స్లిమ్ గా చాలా తక్కువ బరువు ఉండే వాటిని కోరుకునే వారు కూడా ఎక్కువే. అటువంటి వారు ఇక్కడి జాబితాలోని ల్యాప్ టాప్ లను పరిశీలించొచ్చు. ఇవన్నీ కూడా రూ.50,000కుపైన ధర ఉన్నవే.


1. డెల్ న్యూ ఇన్ స్పిరాన్ 15
స్లీక్ బెజెల్స్ తో కూడిన 15.6 అంగుళాల డిస్ ప్లే, రిజల్యూషన్ 1,920x1,080 పిక్సల్స్, బ్యాక్ లిట్ కీబోర్డు, 8వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, నివిడియా జీఫోర్స్ 940 ఎంఎక్స్ జీపీయూ, 4జీబీ డెడికేటెడ్ మెమొరీ, 128 జీబీ+1టీడీతో కూడిన డ్యుయల్ హార్డ్ డిస్క్ ఇందులో ఉన్నాయి.

2. హెచ్ పీ ఎన్వీ
13.3 అంగుళాల డిస్ ప్లే కలిగిన ల్యాప్ టాప్. ఐపీఎస్ స్క్రీన్, 1,920, 1,080 హెచ్ డీ రిజల్యూషన్, క్వాడ్ స్పీకర్, 8వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256జీబీ ఎస్ఎస్ డీ, 6సెల్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లున్నాయి. దీని బరువు 1.3 కేజీలే.

3. ఆసుస్ యూఎక్స్ 430
ఆసుస్ కు చెందిన ఈ ల్యాప్ చాలా పల్చగా ఉంటుంది. బరువు 1.25 కేజీలే. 14 అంగుళాల నాన్ రిఫ్లెక్టివ్ డిస్ ప్లే, నివిడియా ఎంఎక్స్ 150 జీపీయూ, 8వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, 16జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్ డీ ఉన్నాయి. బ్యాటరీ 9 గంటల పాటు పనిచేసే సామర్థ్యం కలిగినది.

4. లెనోవో ఐడియా ప్యాడ్ 320 స్లిమ్
స్లీక్ బెజెల్స్ శ్రేణిలో తక్కువ ధరకు లభించే ల్యాప్ టాప్ మోడల్ ఇది. 14 అంగుళాల డిస్ ప్లే, 1,920, 1,080 హచ్ డీ రిజల్యూషన్ తో ఉండే దీని బరువు 1.9 కిలోలు. 7వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 1టీబీ హార్డ్ డిస్క్, 7 గంటల బ్యాకప్ కలిగిన బ్యాటరీ ఉన్నాయి. అల్యూమినియం ఫినిష్ తో 2 వాట్స్ పవర్ కలిగిన రెండు హార్మన్ డాల్బీ స్పీకర్లతో వస్తుంది.

5.  హెచ్ పీ పెవిలియన్ 14
ఇది న్యారో బెజిల్ డిస్ ప్లే తో ఉంటుంది. 14 అంగుళాల స్క్రీన్ తో ఉండే ఈ నోట్ బుక్ బరువు 1.62 కిలోలు. స్క్రీన్ రిజల్యూషన్ విషయానికొస్తే 1,920, 1,080 పిక్సల్స్ తో ఉంటుంది. హెచ్ పీ ఆడియో బూస్ట్ డ్యుయల్ స్పీకర్లతో వస్తుంది. 7వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 1టీబీ హార్డ్ డిస్క్, 10 గంటల బ్యాకప్ కలిగిన బ్యాటరీ ఉన్నాయి.

6. డెల్ న్యూ ఎక్స్ పీఎస్ 13
13.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఇన్ఫినిటీ ఎడ్జ్ డిస్ ప్లేతో ఉంటుంది. ఇతర ల్యాప్ టాప్ లు సైడ్ స్లిమ్ బెజెల్స్ తో ఉంటే, ఇది మాత్రం స్లిమ్ సైడ్ తో పాటు స్లిమ్ టాప్ బెజెల్స్ తో వస్తుంది. దీని బరువు కేవలం 1.22 కిలోలే. 8వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్ డీ ఇందులో ఉన్నాయి.

7. లెనోవో యోగా 920
13.9 అంగుళాల టచ్ స్క్రీన్ తో వస్తుంది. దీని రిజల్యూషన్ ఇతర స్లిమ్ ల్యాప్ టాప్ లతో పోలిస్తే ఎంతో ఎక్కువనే చెప్పాలి. 3,840, 2,160 పిక్సల్స్ తో ఉంటుంది. బరువు 1.3 కిలోలు. యోగా 920 ల్యాప్ టాప్ ను 360 డిగ్రీల కోణంలో ఏ దిశలో అయినా తిప్పుకుని పనిచేసుకోవచ్చు. జీేబీఎల్ స్పీకర్లుతో వస్తుంది. 8వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, 16జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ ఎస్ డీ ఉన్నాయి.


More Articles