- సీజేపీకి మద్దతు ఇవ్వబోమన్న అన్నామలై
- ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని స్పష్టీకరణ
- చట్ట ప్రకారమే అరెస్టులు జరగాలని డిమాండ్
- దేశభక్తిపై తనకు ఎవరూ పాఠాలు చెప్పొద్దని వ్యాఖ్య
- మోదీని ప్రశంసిస్తూనే తప్పులను ప్రశ్నిస్తానని వెల్లడి
- బీజేపీకి, అన్నామలైకి మధ్య పెరుగుతున్న మాటల యుద్ధం
కాక్రోచ్ జనతా పార్టీకి (సీజేపీ) తాము ఎప్పటికీ మద్దతు ఇవ్వబోమని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై స్పష్టం చేశారు. ఆ పార్టీ ఎజెండా వేరని, తమ లక్ష్యాలు వేరని చెప్పారు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి పోరాడే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. సీజేపీ నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు తీసుకున్న చర్యలను ప్రశ్నించిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గురువారం తన ‘వీ ది లీడర్స్’ వేదిక నిర్వహించిన కార్యక్రమంలో అన్నామలై మాట్లాడారు. సీజేపీ నిరసనకారులు చట్టాన్ని ఉల్లంఘించి ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేగానీ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించకూడదన్నారు. దేశ సార్వభౌమత్వానికి ముప్పు ఉంటే నిఘా సంస్థలు ‘ఐబీ’, ‘రా’ ద్వారా విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. సోషల్ మీడియాలో అనవసర భయాలు సృష్టించవద్దని హితవు పలికారు.
దేశభక్తి గురించి తనకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నామలై అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని, భారత ఐక్యత, సార్వభౌమత్వం గురించి తనకు తెలుసని పేర్కొన్నారు. అదే సమయంలో ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వంటి ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను అంగీకరించలేమని స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ మంచి పనులు చేస్తున్నారని ప్రశంసించిన అన్నామలై.. ఆయనకు మద్దతు ఇస్తూనే తప్పుగా అనిపించిన అంశాలను ప్రశ్నిస్తామని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించకూడదని పేర్కొన్నారు.
ఈ నెల 10న సీజేపీ నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు తీసుకున్న చర్యలతో అన్నామలై, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను అదుపులోకి తీసుకోవడాన్ని అన్నామలై ప్రశ్నించారు. సీజేపీ విధానాలతో తాను ఏకీభవించకపోయినా, నిరసన తెలిపే హక్కును సమర్థించారు.
బీజేపీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు గడిచినా శత్రువులను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని అన్నామలై విమర్శించారు. సీజేపీని వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తూనే ఆ పార్టీకి ఉచిత ప్రచారం కల్పిస్తోందా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి తీవ్రంగా స్పందించారు. శాంతియుత నిరసనకు, ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని ఉల్లంఘించడానికి మధ్య తేడాను అన్నామలై విస్మరిస్తున్నారని విమర్శించారు.