భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తెరలేచింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన గత సిరీస్‌ను 2-2తో సమం చేసిన టీమిండియా, ఈ పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ మ్యాచ్ కోసం భారత జట్టు యాజమాన్యం తుది జట్టులో కీలక మార్పులు చేసింది. యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిలకు అవకాశం కల్పించింది. వీరి రాకతో జట్టు పేస్ విభాగం మరింత పటిష్ఠ‌మైంది. ఈ ఇద్దరి చేరికతో ప్రిన్స్ యాదవ్, శివమ్ దూబేలు బెంచ్‌కే పరిమితమయ్యారు. దీంతో జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది.

ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ బరిలోకి దిగుతున్నారు. దీంతో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వేచి చూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. మరోవైపు, మిచెల్ శాంట్నర్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు కూడా పటిష్ఠంగా కనిపిస్తోంది. ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్ వంటి స్టార్ ఆటగాళ్లతో కివీస్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది.

తుది జట్లు:

భారత్:
సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.

న్యూజిలాండ్: ఫిన్ అలెన్, టిమ్ సైఫర్ట్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, ఆడమ్ మిల్నే, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్.